Central Cabinet: వన్ నేషన్-వన్ సబ్స్క్రిప్షన్ పథకానికి ఆమోదం..! 26 d ago
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని అలాగే పాన్‌కార్డు ఆధునీకరణకు నిర్ణయించారు. నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్‌కు ఆమోదించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో సౌరవిద్యుత్ కేంద్రానికి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటల్ పథకానికి రూ.2,750 కోట్లు కేటాయించింది. ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం, వన్ నేషన్-వన్ సబ్స్క్రిప్షన్ పథకానికి ఆమోదం, సబ్స్క్రిప్షన్ పథకానికి రూ.6వేల కోట్లు కేటాయింపు చేస్తున్నట్లు సోమవారం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.